KTM Duke: 2025 KTM 390 డ్యూక్ అప్‌డేట్.. క్రూయిజ్ కంట్రోల్ తో మరింత సౌకర్యం.! 26 d ago

ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ KTM ఇండియా తన 2025 KTM 390 డ్యూక్ మోడల్‌ను అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా..2025 KTM 390 అడ్వెంచర్‌లో కనిపించే క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షనాలిటీని 390 డ్యూక్‌కు అందించింది. అలాగే సీటు ఎత్తును కూడా తగ్గించినట్లు డీలర్‌షిప్‌లో కనిపించింది. ఒకసారి ఆ అప్‌డేటెడ్ ఫీచర్లను చూద్దాం రండి!
కొత్త ఫీచర్లు:
- గత నెలలోనే KTM 390 డ్యూక్ ధరలను రూ. 18 వేలు తగ్గించింది. దీంతో డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర ₹2.95 లక్షలకు తగ్గింది.
- ఇప్పుడు 2025 అప్‌డేట్‌గా KTM 390 అడ్వెంచర్ క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్‌ను KTM 390 డ్యూక్‌కు ఎక్స్టెండ్ చేసింది.
- సీటు ఎత్తు విషయానికి వస్తే.. కొన్ని నివేదికలు 390 డ్యూక్ సీటు ఎత్తు తగ్గించినట్లు పేర్కొన్నాయి. అయితే మరికొన్ని నివేదికలు సీటు ఎత్తులో ఎటువంటి మార్పు చేయలేదని, అది ఇప్పటికీ 800mm ఉందని చెబుతున్నాయి.
కలర్ ఫీచర్:
అప్‌డేటెడ్ 390 డ్యూక్ కొత్త రంగులో వస్తుంది. ట్యాంక్, ఫెండర్లు, టెయిల్ సెక్షన్ అన్నీ గ్రే కలర్‌లో ఉన్నాయి. వాటికి ఆరంజ్ రంగు గ్రాఫిక్స్ జోడించడంతో బైక్ మరింత అందంగా కనిపిస్తుంది. ఈ కొత్త రంగుల వల్ల బైక్‌కి కొత్త లుక్ వచ్చింది..దీని స్పోర్టీ డిజైన్ మరింత హైలైట్ అవుతోంది.
పవర్‌ట్రెయిన్:
KTM 390 అడ్వెంచర్ లాగానే KTM 390 డ్యూక్‌లో కూడా 399cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 45.3bhp పవర్ అలాగే 39Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది..ఇది గేర్లు మార్చడానికి చాలా సులభంగా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షనాలిటీతో పాటు.. ఇది KTM లాంఛ్ కంట్రోల్, రైడర్ మోడ్స్ (రెయిన్, రోడ్, ట్రాక్), ట్రాక్షన్ కంట్రోల్, లీన్-సెన్సిటివ్ ABS మరియు 6-యాక్సిస్ IMU వంటి ఫీచర్లను కలిగి ఉంది..డ్యూయల్-ఛానల్ ABS మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ కూడా ఉంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు:
- 390 డ్యూక్
- డిస్ప్లేస్‌మెంట్: 399 cc, సింగిల్
- పవర్: 45.3 bhp
- టార్క్: 39 Nm
ధర:
KTM సంస్థ అప్‌డేట్ చేయబడిన డ్యూక్ 390 ధరలను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ను రూ. 2.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తుంది. అయితే ఈ అప్‌డేటెడ్ డ్యూక్ ధరలో స్వల్ప పెరుగుదలను ఆశించవచ్చు.
కీ పాయింట్స్:
- 2025 KTM 390 డ్యూక్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌తో మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తుంది.
- అలాగే నూతన కలర్ తో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
- ఇంజిన్ పనితీరు, ఇతర ఫీచర్లలో ఎటువంటి మార్పులు లేవు.
- ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు.
KTM సంస్థ 390 డ్యూక్‌ను రోజువారీ రైడింగ్ మరియు లాంగ్ ట్రిప్స్‌కి మరింత మెరుగ్గా చేసింది. రైడర్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని రైడర్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఎప్పటికప్పుడు KTM తమ సత్తా చాటుతుంది. క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆలోచనాత్మకమైన నవీకరణలతో.. ఇది థ్రిల్లింగ్ మరియు విభిన్నమైన రైడ్ కోసం చూస్తున్న రైడర్‌లకు ప్రత్యేకమైన ఎంపికగా ఉంటుంది.